సమ్మర్ మొదలవ్వగానే ప్రజలు మండే ఎండలతో బయటకు కూడా వెళ్ళలేక ఇంట్లోనే ఇబ్బంది పడతారు. ఇక ఇదే సమయంలోనే దోమలు కూడా విపరీతంగా పెరుగుతాయి. పగటిపూట ఎండలు, సాయంత్రం దోమలతో జనాలు విసిపోతారు.
ఇక పల్లెటూరు అని లేదు సిటీ అని లేదు ఏరియా ఏదైనా ప్రతిచోటా ఈ దోమలతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ కాలంలో పడే వానల వలన ఇంటి చుట్టూ నీరు నిలబడతాయి. దీనివల్ల దోమల లార్వాలు భారీగా వృద్ధి చెందుతాయి.
ఈ దోమల నుండి తప్పించుకోవడానికి అగరబత్తులు లేదా సాంబ్రాన్ వాడుతారు. వాటి కన్నా కూడా ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే దోమలు మీ ఇంట్లో అడుగు కూడా పెట్టలేవు. ఆ మొక్క మరేదో కాదు దామ్రో మొక్క.
దామ్రో మొక్క దోమలను తరిమికొట్టగలదు. ఇది చూడటానికి తులసిలా కనిపిస్తుంది. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇది మీ ఇంటి పెరట్లో ఉంటే మంచి ఫలితం ఉంటుంది. దీని ఘాటైన వాసన వలన దోమలు, కీటకాలు దగ్గరకు కూడా రావు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




