Reading Time: < 1 minute

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత భారత పతాకం కలిగిన ఎల్‌పిజి ట్యాంకర్ జగ్ విక్రమ్ శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హర్మూజ్ జలసంధిని దాటి శనివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్ లోకి ప్రవేశించింది. మరి కొద్ది రోజుల్లో భారత్‌కు ఇది చేరుకోనుంది. కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత హర్మూజ్‌ను దాటిన మొట్టమొదటి నౌక ఇదే. మార్చి నెల మొదట్లో హార్ముజ్ జలసంధిని దాటిన తొమ్మిదో నౌక జగ్ విక్రమే అవుతుంది. మరో భారత రిజిస్టర్డ్ నౌకలు పర్షియన్ గల్ఫ్ లోనే ఉన్నాయని,త్వరలో అవి కూడా ఇదే మార్గం మీదుగా భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.