Reading Time: < 1 minute
Ttd Server Issue Srivani Darshan Online Ticket Booking Cancelled Today

TTD Server Issue: తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో, ఇవాళ విడుదల చేయాల్సిన శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్‌లైన్ జారీని తాత్కాలికంగా రద్దు చేశారు అధికారులు.. సాధారణంగా ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేస్తారు. అయితే, ఈరోజు సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, ఆన్‌లైన్ ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది టీటీడీ.. ఆఫ్‌లైన్ విధానంలో శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు అన్నమయ్య భవన్‌ వద్ద టికెట్లను ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.. టికెట్లు పొందాలనుకునే భక్తులు అవసరమైన గుర్తింపు పత్రాలతో సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు. అలాగే సర్వర్ సమస్య పరిష్కారానికి సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సర్వర్ సమస్య పరిష్కారమైన వెంటనే తిరిగి ఆన్‌లైన్ సేవలను ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు టీటీడీ అధికారులు..

Read Also: Gudivada Amarnath: చంద్రబాబుకు ఓటేసి ప్రజలు నాలుగోసారి మోసపోయారు..!