
‘జన నాయగన్’ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం పట్ల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఆయన తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సినిమా టీమ్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించారు.
విజయ్ దేవరకొండ X వేదికగా స్పందిస్తూ.. “జననాయగన్ లీక్ నాకు కోపం తెప్పిస్తోంది. నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటిది జరిగినప్పుడు కలిగే బాధను, నష్టభావాన్ని నేను స్వయంగా అనుభవించాను. మిమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపిస్తుంది, ఆశ కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఇది కేవలం నా గురించే కాదు, నా సహనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇంకా ఎందరో తమ కలలన్నీ పణంగా పెట్టి ఉన్నారు.
ఈ ప్రస్తుత సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. దీని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించాలి. అలా జరగకపోతే, అది సిస్టమ్ ఫెయిల్యూర్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలు ఎంత సున్నితత్వం లేకుండా ప్రవర్తించగలరో, కొందరు ఎలాంటి రెండో ఆలోచన లేకుండా ఇతరులకు నష్టం కలిగించడానికి ఎంత దిగజారగలరో ఈ సంఘటన మనకు గుర్తుచేస్తోంది, చిత్ర బృందం మొత్తానికి నా ప్రగాఢ సానుభూతిని, బేషరతు మద్దతును తెలియజేస్తున్నాను” అని విజయ్ పోస్టు చేశారు.
The #JanaNayagan leak makes me angry.
I’ve experienced personally the pain and sense of loss when something like this happens, early in my career. You feel like a target, you feel a loss of hope, it’s not just about me, there are co-actors, directors, producers, and so many who…
— Vijay Deverakonda (@TheDeverakonda) April 11, 2026
ఇప్పటికే, మూవీ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా స్పందించారు. KVN ప్రొడక్షన్స్‌కు మద్దతుగా నిలుస్తూ, దోషులను శిక్షించాలని కోరారు. ఈ మేరకు “పైరసీని అరికట్టాలి.. సినిమాను కాపాడాలి” అని అన్ని భాషల సినిమా పరిశ్రమలకు చిరు పిలుపునిచ్చారు.
The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me.
Cinema is built on trust, effort, and the collective dreams of many.Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work.
We stand one with KVN…
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026
చిన్న క్లిప్‌తో మొదలై..పెద్ద సంక్షోభంగా మారిన లీక్
దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఆన్‌లైన్ లీక్ వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.400–500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలకు ముందే పైరసీ బారిన పడటం నిర్మాణ సంస్థకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
నివేదికల ప్రకారం, మొదటగా సుమారు ఐదు నిమిషాల నిడివి గల ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో టైటిల్ సీక్వెన్స్, హీరో పరిచయం, క్లైమాక్స్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నట్లు సమాచారం. వెంటనే నిర్మాతలు ఆ క్లిప్‌లను తొలగించే ప్రయత్నాలు చేసినప్పటికీ, అవి వేగంగా వైరల్ అయ్యాయి..
Also Read : బాక్సాఫీస్ వద్ద ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టారా?
అయితే పరిస్థితి అక్కడితో ఆగలేదు. కొద్దిసేపటికే పూర్తి సినిమా హెచ్‌డీ క్వాలిటీలో పైరసీ వెబ్‌సైట్లలో లీక్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ లీక్‌కు అసలు మూలం ఏమిటన్నది ఇంకా స్పష్టత రాకపోవడం, భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. కంటెంట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా, అది ఇప్పటికే విస్తృతంగా వైరల్ అవ్వడంతో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తేవడం కష్టమైంది.
#JanaNayagan pic.twitter.com/wNLRSsmaHq
— KVN Productions (@KvnProductions) April 10, 2026