మారుతున్న ఆహారపు అలవాట్లు వలన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే, యువతలో భారీగా పెరుగుతున్న సమస్యలలో గ్యాస్ట్రిక్ కూడా ఒకటి. ఒకసారి గ్యాస్ పడితే ఆ బాధ అంతా ఇంతా కాదు.
చిన్న సమస్యే అని నిర్లక్ష్యం చేస్తే ఇతర అనారోగ్యాలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంక 25 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది అయితే, మరి ఆందోళన కలిగిస్తోంది.
గ్యాస్ పట్టినప్పుడు కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది. దీని వలన కడుపులో ఉండే లోపలి పొర దెబ్బతిని మంట వస్తుంది.
ఇంకా ఆజీర్ణం, ఉబ్బరం, పుల్ల త్రేన్పులు వస్తాయి. ఇవి రోజువారీ అలవాట్లు కూడా కారణాలుగా అవుతున్నాయి.
గ్యాస్ పట్టిన వెంటనే మందులపై ఆధారపడుతుంటారు. అయితే, ఇది మంచి పద్దతి కాదని అంటున్నారు. ప్రత్యేకంగా, కొన్ని రకాల టాబ్లెట్స్ను వైద్యులు వాడడం మంచిది కాదని అంటున్నారు. ఇంకా వీటిని అధికంగా వాడితే కిడ్నీలు దెబ్బ తింటాయని అంటున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




