Reading Time: < 1 minute
Srh Vs Pbks Ipl 2026 Abhishek Sharmas 74 Powers Hyderabad To 219 Sets Huge Target

SRH vs PBKS: ముల్లన్ పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా జరుగుతున్న 17వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పంజాబ్ కింగ్స్ జట్టు ముందు భారీ టార్గెట్ ను సెట్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఆరంభం నుంచే లక్ష్యంగా చేసుకున్న హైదరాబాద్ ఓపెనర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ బ్యాటర్లు మాత్రం ఆ నిర్ణయం తప్పని నిరూపిస్తూ నిర్ణిత 20 ఓవర్స్లో 219 పరుగుల భారీ స్కోరును సాధించారు.

PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..

ఇక SRH ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే 8 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడేసాడు. అతనికి తోడుగా ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 38 పరుగులతో ధాటిగా ఆడటంతో మొదటి వికెట్‌కు 8.1 ఓవర్లలోనే 120 పరుగులు నమోదయ్యాయి. ఈ జోడిని శశాంక్ సింగ్ విడదీసినప్పటికీ.. అప్పటికే హైదరాబాద్ భారీ స్కోరుకు పునాది వేసింది.

ఓపెనర్లు పెవిలియన్ చేరిన తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ (27) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ నెమ్మదిగా ఆడినప్పటికీ, చివర్లో అనికేత్ వర్మ (18 పరుగులు) మెరుపులు మెరిపించాడు. హెన్రిచ్ క్లాసెన్ 33 బంతుల్లో 39 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖర్లో అవుట్ అయ్యాడు. చివరికి సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్‌ను ముగించింది.

IPL 2026లో అదిరిపోయిన ఇన్నింగ్స్ మ్యాచ్‌లను మలుపు తిప్పేసిన హీరోలు వీరే!

పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో భారీగా 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక శశాంక్ సింగ్ 3 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి కీలకమైన ఓపెనర్ల వికెట్లు పడగొట్టి హైదరాబాద్ బ్యాటర్స్ దూకుడికి బ్రేకులు వేశాడు. జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. చుడాలిమరి మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ కింగ్స్ 220 పరుగుల భారీ లక్షాన్ని ఎలా ఛేదిస్తుందో.