
రాష్ట్ర వ్యాప్తంగా బీడీ ఆకుల సీజన్ 2025కి సంబంధించి 30 జిల్లాల్లోని 37 డివిజన్‌లలో బీడీ ఆకుల పథకం అమలుకు గాను అటవీ, పర్యావరణ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్‌లో రూ.54.90 కోట్లతో బీడీ ఆకుల పథకం అమలుకు అటవీ శాఖ ప్రధాన సంరక్షునికి అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఏజెంట్‌గా ఉంటూ బీడీ ఆకుల కొనుగోలు, వ్యాపారానికి బాధ్యత వహిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా అటవీ అభివృద్ధి సంస్థ ఇందుకు అవసరమైన రుణాలను కన్సార్టియం బ్యాంకుల నుంచి పొందేందుకు కూడా అనుమతిచ్చింది.