
కులాల వారి గణనను నిలిపివేయాలనే ప్రజావ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన పిటిషనర్
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా మందలించారు. పిటిషన్‌లో వాడిన పదజాలంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో అనుచిత భాష వాడారు. ఎవరు ఈ పిటిషన్ మీకు రాసి ఇచ్చారని ప్రదాన న్యాయమూర్తి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2027 జనాభా లెక్కల ప్రక్రియను ప్రకటించింది. ఇందులో కులాల వారిగా జనసంఖ్యను సేకరించడం, తొలిసారిగా డిజిటల్ సెన్సస్ ప్రక్రియలను చేర్చారు. కులగణనకు సరైన మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంటూ పిటిషనర్ పిల్‌లో వాడిన పదాలు వివాదాస్పదం అయ్యాయి.