Reading Time: 2 minutes

Lik Movie Box Office: బాక్సాఫీస్ వద్ద ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టారా?.. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ తొలిరోజు వసూళ్లు ఇవే!

Caption of Image.

కోలీవుడ్ యంగ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. ‘లవ్ టుడే’, ‘డ్యూడ్’ వంటి వరుస హిట్లతో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్.. లేటెస్ట్ గా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) తో బాక్సాఫీస్ వద్ద మరోసారి సత్తా చాటుతున్నారు. నిన్న (ఏప్రిల్ 10న ) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తూ, భారీ వసూళ్లను రాబట్టింది.

తొలిరోజు వసూళ్లు..

సినీ ట్రేడ్ అంచనాల ప్రకారం.. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 9.93 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  భారతదేశంలోనే 3,202 షోల ద్వారా రూ. రూ. 7.93 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తమిళనాడులో ఈ చిత్రం రూ. 5.45 కోట్ల నెట్ వసూళ్లతో 37 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో  కూడా ప్రదీప్‌కు ఉన్న క్రేజ్ వల్ల రూ. 1.40 కోట్ల నెట్ వసూలైంది. విదేశీ మార్కెట్లలో రూ. 2 కోట్లు రాబట్టింది…

కథేంటంటే?

ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ మూవీలో హీరో తన నిజమైన ప్రేమను వెతుక్కునే క్రమంలో ఒక గ్యాడ్జెట్ సహాయంతో 2040లోకి టైమ్ ట్రావెల్ చేస్తాడు. మనసులోని భావాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోకి, భవిష్యత్తులో అన్నీ యాప్స్ , టెక్నాలజీతో ముడిపడి ఉన్న ప్రపంచం కనిపిస్తుంది. మరి ఒక యాప్ మనిషి హృదయాన్ని రీప్లేస్ చేయగలదా? టెక్నాలజీ ప్రేమను కొలవగలదా? అనే ప్రశ్నల చుట్టూ వినోదభరితంగా సాగే ప్రయాణమే ఈ చిత్రం.

నటీనటుల పర్ఫార్మెన్స్

హీరో ప్రదీప్ రంగనాథన్ తనదైన మేనరిజమ్స్ , కామెడీ టైమింగ్‌తో సినిమాను భుజాన వేసుకున్నారు. యూత్ కనెక్ట్ అయ్యే బాడీ లాంగ్వేజ్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. ప్రదీప్ పక్కన కృతి శెట్టి నటన చాలా సహజంగా ఉంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ప్రతి సినిమాలోనూ తనదైన మార్క్ వేసే SJ సూర్య, ఇందులోనూ తన నటనతో థియేటర్లలో నవ్వులు పూయించారు. ఆయన పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుంది. కీలక పాత్రలో నటించిన సీమాన్ తన గంభీరమైన నటనతో సినిమాకు బలాన్ని ఇచ్చారు.

►ALSO READ | Dacoit Box Office : బాక్సాఫీస్ వద్ద ‘డెకాయిట్’ వేట.. తొలి రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

అయితే కథనం చాలా బలహీనంగా ఉందన్న మిశ్రమ టాక్ వినిపిస్తోంది. కాన్సెప్ట్ బాగున్నా, దాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు కొంత తడబడ్డారు. ఫస్టాఫ్ సరదాగా సాగినా, సెకండ్ హాఫ్ సాగదీతగా అనిపిస్తుందన్న అభిప్రాయం ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్‌తో ..

విఘ్నేష్ శివన్ పాతకాలపు ప్రేమకథను ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్‌తో జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు 2040 నాటి ప్రపంచాన్ని చూపించిన తీరు బాగుందని టాక్ వినిపిస్తోంది. ‘డ్యూడ్’ వంటి సూపర్ హిట్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నప్పటికీ, వారాంతంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

 

©️ VIL Media Pvt Ltd.