Reading Time: 2 minutes
జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే.. అలాంటి రూమర్స్ పుట్టించారు

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి సత్య శ్రీ ఒకరు. ఈ చిన్నది తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సినిమాల్లోనూ నటించింది ఈచిన్నది. ఇటీవలే అనగనగా ఓ రాజు సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సత్య శ్రీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, జబర్దస్త్ నటుడు చమ్మక్ చంద్రతో తన సంబంధంపై మీడియాలో వస్తున్న రూమర్లపై ఆమె వివరణఇచ్చింది. ఈ రూమర్లను సత్య శ్రీ తీవ్రంగా ఖండించింది. చమ్మక్ చంద్రను తాను గురువుగా గౌరవిస్తానని స్పష్టం చేసింది. సత్య శ్రీ మాట్లాడుతూ, “ఆయన నాకు ఛాన్స్ ఇచ్చిన గురువు. జబర్దస్త్ సత్య శ్రీ అనే పేరు నాకు వచ్చిందంటే ఆయన వల్లే. నన్ను అంత షార్ప్ చేశారు. నిజం చెప్పాలంటే యాక్టింగ్ నాకు అంతగా తెలిసేది కాదు ఫస్ట్ లో.. జబర్దస్త్ కు వచ్చాకే షార్ప్ అయ్యాను” అని పేర్కొన్నారు.

అప్పట్లో ఊపేసిన నాగమ్మ సీరియల్‌.. నాగదేవతగా చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

చంద్రతో తనకు ఉన్నది గురు-శిష్య సంబంధం మాత్రమేనని, వారిద్దరూ వ్యక్తిగతంగా కలిసింది, మాట్లాడుకుంది ఎప్పుడూ లేదని, కేవలం రిహార్సల్స్, షూటింగ్‌ల సమయంలోనే కలుస్తారని ఆమె తెలిపారు. ఈ రూమర్ల గురించి మొదట తన తండ్రి యూట్యూబ్ ద్వారా తనకు తెలియజేశారని సత్య శ్రీ తెలిపింది. తన తండ్రి ఈ రూమర్లను నమ్మకుండా, తన కూతురుపై నమ్మకం ఉందని, చమ్మక్ చంద్ర గురించి కూడా తమకు తెలుసని చెప్పినట్లు ఆమె వివరించింది. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ రూమర్లను తన ఎదుగుదలకు, జనాల్లో తనకున్న గుర్తింపునకు నిదర్శనంగా భావించి, సానుకూలంగా తీసుకోమని తనకు ధైర్యం చెప్పారని తెలిపింది.

రఘువరన్ చివరి రోజుల్లో అంత బాధను అనుభవించారా.! మద్యానికి బానిసై చివరకు

ఇండస్ట్రీలోకి రావడానికి మొదట అంగీకరించని తన తండ్రి, ముఖ్యంగా జబర్దస్త్ అంటే ఇష్టం లేని వారు, ఈ రూమర్ల సమయంలో తనకు వెన్నుదన్నుగా నిలిచారని, వారి మద్దతు తన జీవితంలో మర్చిపోలేనిదని సత్య శ్రీ తెలిపింది. రూమర్లకు భయపడి తప్పుకుంటే, అది నిజం అని నమ్మే అవకాశం ఉందని, కనుక తాను వాటిని పట్టించుకోకుండా తన పనిని కొనసాగిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. జబర్దస్త్ షో తనకు ఒక గొప్ప ప్లాట్‌ఫామ్‌ ఇచ్చిందని, ఆ గుర్తింపు పట్ల తనకు ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుందని సత్య శ్రీ తెలిపింది. తాను ఇంకా “జబర్దస్త్ సత్య శ్రీ” గానే గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని చెప్పారు. జబర్దస్త్ నుండి బయటకు రావడానికి గల కారణాన్ని వివరిస్తూ, చమ్మక్ చంద్ర బయటకు వెళ్లడం వల్లే తాను కూడా బయటకు వచ్చానని తెలిపింది.

అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?

 

View this post on Instagram

 

A post shared by Satya Sri (@me_satyasri)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.