
హైదరాబాద్: సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపి మల్లు రవి కూడా పాల్గొని పూలే చిత్రపటానికి అంజలి ఘటించారు. అణగారిన వర్గాల సామాజిక న్యాయం, మహిళా విద్య కోసం వారు చేసిన విశేష కృషి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక సాధికారత కోసం పూలే స్ఫూర్తితో తెలంగాణలో సమగ్ర కుల గణన, ఎస్సి ఉపకులాల వర్గీకరణ వంటి అనేక నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
స్వాతంత్య్ర సమరయోధురాలు, మహిళా చైతన్య స్ఫూర్తి కస్తూర్బా గాంధీ జయంతి సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ఆ త్యాగమూర్తికి నివాళులర్పించారు. సత్యం, అహింస, సేవామార్గం వంటి విలువలను జీవితాంతం ఆచరించి, సమాజానికి ఆదర్శంగా నిలిచారని, ఆమె త్యాగస్ఫూర్తి, సహనం, నిబద్ధత అందరికీ ప్రేరణగా నిలుస్తాయని సిఎం పేర్కొన్నారు.