Reading Time: < 1 minute
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ

సాధారణంగా అభిమాన నాయకుల పుట్టినరోజు వచ్చిందంటే పాలాభిషేకాలు, కేక్ కటింగ్స్, భారీ ఫ్లెక్సీలతో హంగామా చేయడం చూస్తుంటాం. కానీ వరంగల్‌లో మాత్రం ఎంపీ కడియం కావ్య జన్మదిన వేడుకలు అత్యంత విచిత్రంగా, వినూత్నంగా జరిగాయి. ఒక రైతు తన అభిమానాన్ని ఏకంగా టన్నుల కొద్దీ టమాటాలతో చాటుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్‌ 10న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా సముద్రాల మధు అనే టమాటా రైతు వినూత్నంగా ఎంపీకి పుట్టిరోజు శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. తన పంట చేనులోనే ఎంపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, దానికి టన్ను లోడ్ టమాటాలతో అభిషేకం నిర్వహించారు. కుప్పలు తెప్పలుగా టమాటాలను ఎంపీ చిత్రపటంపై కుమ్మరిస్తుంటే చూసేవారంతా ఆశ్చర్యపోయారు. అభిషేకం పూర్తయిన తర్వాత ఆ టమాటాలను వృథా చేయకుండా, అక్కడే ఉన్న స్థానిక కూలీలకు, ప్రజలకు పంచిపెట్టారు. దీంతో కూలీలు ఎగబడి మరీ సంచుల్లో టమాటాలను నింపుకుని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లారు. ఒకవైపు ఎంపీపై అభిమానం చాటుకుంటూనే, మరోవైపు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లయిందని స్థానికులు కొనియాడారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్ట్ పునఃనిర్మాణం, కోచ్ ఫ్యాక్టరీ సాధనలో కడియం కావ్య చేస్తున్న కృషి ఎనలేనిదని రైతు మధు చెప్పారు. 40 ఏళ్ల తర్వాత వరంగల్ గడ్డ నుంచి ఒక మహిళ పార్లమెంట్‌లో ‘స్త్రీ శక్తి’ని చాటుతుండటం గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రుణగ్రహీతలకు షాక్..పెరగనున్న EMI భారం ??

క్రీమ్ బిస్కెట్ కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే..!

జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్‌ గురిపెట్టినా వెనక్కి తగ్గని మహిళా సిబ్బంది.. చివరకు

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్