
ఇండియాలో ఎస్‌యూవీ విభాగం వేగంగా విస్తరిస్తుండగా మారుతీ సూజుకీ తన ప్రజాదరణ పొందిన మోడల్ బ్రెజ్జాకు కీలక అప్‌డేట్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. మార్కెట్‌లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని, ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మరింత ఆధునిక ఫీచర్లతో అందించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇటీవల టెస్టింగ్‌లో కనిపించిన కొత్త బ్రెజ్జా ఆధారంగా, వాహనం రూపంలో కొన్ని మార్పులు ఉండనున్నాయి. ముందుభాగంలో కొత్త గ్రిల్, సవరించిన బంపర్లు, క్రోమ్ ఎలిమెంట్స్‌తో డిజైన్ మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. అలాగే కొత్త అల్లాయ్ వీల్స్‌తో ఎక్స్‌టీరియర్ లుక్‌కు స్టైలిష్ టచ్ ఇవ్వనున్నారు. అయితే వాహనం ప్రాథమిక డిజైన్‌ను పెద్దగా మార్చకుండా, చిన్న మార్పులతోనే ఆధునికతను తీసుకురానున్నారు.
ఫీచర్ల విషయంలో ఈ అప్‌డేట్ కీలకంగా మారనుంది. పెద్ద 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి సౌకర్యాలు ఇందులో ఉండే అవకాశముంది. భద్రత పరంగా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లెవెల్-2 వంటి ఆధునిక సాంకేతికతను కూడా అందించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కొనసాగిస్తూ, పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందించే అవకాశముంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పాటు, కొత్తగా 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్‌ను కూడా జోడించే అవకాశముంది. అంతేకాకుండా, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం బ్రెజ్జా ధర రూ.9.68 లక్షల నుంచి రూ.15.42 లక్షల మధ్య ఉండగా, కొత్త మోడల్ ధరలో రూ.20,000 నుంచి రూ.60,000 వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా. ఈ అప్‌డేట్ తర్వాత బ్రెజ్జా, టాటా నెక్సా, హ్యుందాయ్ వెను, కియా సోనెట్ వంటి మోడళ్లతో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి