Reading Time: 2 minutes
LPG Crisis: గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన.. వినియోగదారులకు భారీ ఉపశమనం!

LPG Crisis: ఇరాన్‌తో అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధంలో రెండు వారాల కాల్పుల విరమణ (Ceasefire) తర్వాత ఎల్‌పీజీ (LPG), పీఎన్‌జీ (PNG), పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? సరఫరా మళ్ళీ మామూలు స్థితికి వస్తుందా? అని ఎదురుచూస్తున్న సామాన్యులకు భారత ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ అంశంపై తాజా వివరాలను వెల్లడించారు.

ప్రభుత్వ ప్రకటనలోని ముఖ్యాంశాలు:

సరిపడా స్టాక్: దేశంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు, పెట్రోల్ బంకుల వద్ద తగినంత స్టాక్ ఉందని, ఎక్కడా కొరత లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిరోజూ సుమారు ఒక లక్ష సిలిండర్లను విక్రయిస్తోంది. మార్చి 14 నుండి ఇప్పటివరకు దాదాపు 1.06 లక్షల టన్నుల ఎల్‌పీజీ విక్రయాలు జరిగాయి. ఇక డొమెస్టిక్ ఎల్‌పీజీ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంది. విశేషమేమిటంటే, 98% బుకింగ్‌లు ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇక మర్షియల్ గ్యాస్ విషయానికొస్తే.. వాణిజ్య అవసరాలకు వాడే ఎల్‌పీజీ సరఫరా కూడా 70% వరకు పునరుద్ధరించారు.

ఇది కూడా చదవండి: Gold Reserves: అత్యధిక బంగారం ఏ దేశం వద్ద ఉంది? భారత్‌ ఏ స్థానంలో? టాప్‌ -5 దేశాలు ఇవే!

5 కిలోల సిలిండర్లపై అప్‌డేట్:

సామాన్యులకు, వలస కూలీలకు ఊరటనిస్తూ, ఎలాంటి ఐడీ ప్రూఫ్ (ID Proof) అవసరం లేకుండా ఇచ్చే 5 కిలోల సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం రెట్టింపు చేసింది. మార్చి 23 నుండి ఇప్పటివరకు సుమారు 11 లక్షల చిన్న సిలిండర్లు అమ్ముడయ్యాయి.

ఇది కూడా చదవండి: YouTube Channel: AI సాయంతో యూట్యూబ్ ఛానెల్.. ఈ ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్.. భారీ ఆదాయం!

పీఎన్‌జీ (PNG) వైపు మొగ్గు:

ఎల్‌పీజీ సిలిండర్ల వాడకాన్ని తగ్గించి, ప్రజలను పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 2400 కంటే ఎక్కువ క్యాంపులను ఏర్పాటు చేశారు. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా 80% వరకు, ఎరువుల రంగానికి 95% వరకు పునరుద్ధరించారు.

 

ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి