Reading Time: 2 minutes

IPL 2026: ఐపీఎల్ కి హసరంగ దూరం.. లక్నో జట్టులోకి సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వానిందు హసరంగ గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరం అయినట్లు ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా హసరంగ కండరాల గాయానికి గురయ్యాడు. ఇప్పటికీ కోలుకోకపోవడంతో లక్నో ఫ్రాంచైజీ అతడిని ఈ సీజన్ వరకు పక్కన పెట్టాలని ఫిక్స్ అయింది. దీంతో హసరంగ స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జార్జ్ లిండేని ఎల్ఎస్‌జీ తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే లిండేకు ఇది తొలి ఛాన్స్ కావడం విశేషం. 

34 ఏళ్ల జార్జ్ లిండే ఇంటర్నేషనల్ స్థాయిలో దక్షిణాఫ్రికా తరఫున 3 టెస్టులు, 4 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ వేలంలో రూ. కోటి బేస్ ప్రైజ్‌తో వచ్చినప్పటికీ.. అతడిని ఎవరూ కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట చూపించలేదు. కానీ ఇప్పుడు లక్నో జట్టులో స్థానం దక్కించుకోవడం అతడికి పెద్ద అవకాశంగా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో లిండేకు మంచి అనుభవం కలిగి ఉన్నాడు.  SA 20, మేజర్ లీగ్ క్రికెట్‌లో ముంబై ఫ్రాంచైజీ తరఫున లిండే ప్రాతినిధ్యం వహించాడు. మొత్తానికి హసరంగా దూరం కావడంతో లక్నో జట్టుకు లోటే అయినా, లిండే అనుభవంతో ఆ లోటును భర్తీ చేయాలని యాజమాన్యం చూస్తోంది. 

►ALSO READ | Virat Kohli: సమయం లేదు మిత్రమా.. బంతిని గౌహతి అవతలికి పంపించు.. షెపర్డ్‌పై కోహ్లీ హిలేరియస్ సెటైర్స్

ఇప్పుడు జార్జ్ లిండే ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదిలా ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండు మ్యాచులలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ యంగ్ ప్లేయర్ ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్‌తో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించిన సంగతి అందరికి తెలిసిందే. 

©️ VIL Media Pvt Ltd.