Reading Time: < 1 minute
Palnadu Macharla Asi Scandal Couples Targeted Videos Used For Blackmail And Harassment

Macharla: రక్షక భట నిలయాలే భక్షక నిలయాలుగా మారుతున్నాయా.? శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కామపిశాచులుగా మారి అబలలపై పడుతున్నారా.? అంటే పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వస్తున్న వార్తలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మాచర్లలో ఒక ఏఎస్ఐ (ASI) సాగిస్తున్న దౌర్జన్యాలు, లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

అందిన సమాచారం ప్రకారం.. మాచర్లకు చెందిన ఒక ఏఎస్ఐ, ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఇందుకోసం జమ్మలమడకకు చెందిన ఒక ఆటో డ్రైవర్‌ను తన ఇన్ఫార్మర్‌గా నియమించుకున్నాడు. ఎక్కడైనా జంటలు ఏకాంతంగా కనిపిస్తే, సదరు ఆటో డ్రైవర్ ద్వారా వారిని రహస్యంగా వీడియోలు తీయిస్తున్నాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని సదరు ఏఎస్ఐ తన అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నాడు.

వారి ఏకాంత వీడియోలు చూపిస్తూ ఆ జంటలను భయభ్రాంతులకు గురిచేయడం ఈ కిలేడి ఏఎస్ఐకి పరిపాటిగా మారింది. వీడియోలు బయటపెడతామని, కేసు పెడతామని బెదిరించి బాధితుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేవలం డబ్బుతోనే ఆగకుండా, తన వికృత కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలను సాకుగా చూపి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Rajat Patidar: “చూస్తుంటే కొట్టేలా ఉన్నాడే”.. వైభవ్ మెడ పట్టుకుని ఆర్సీబీ కెప్టెన్ ఏం చేశాడో చూడండి..

ఈ అరాచకాల్లో సదరు ఏఎస్ఐ ఒక్కడే కాదు, మరో ఏఎస్ఐ మరియు ఒక కానిస్టేబుల్ కూడా భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఇదే తరహాలో మహిళలను లోబర్చుకుంటూ, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేటగాళ్లుగా మారడంతో సామాన్య ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు.