Reading Time: 2 minutes
Easy Garlic Peeling Tips 3 Simple Kitchen Hacks To Remove Garlic Skin Quickly

Easy Garlic Peeling Tips: నిజ జీవితంలో చూడడానికి చాలా సులువుగా అనపిస్తాయి. కానీ వాటిని చేసే సమయంలో మాత్రం తెగ కష్టపడిపోతాము. ఇలాంటి విషయాల్లో ఒకటి వెల్లుల్లి తొక్క లేదా పొట్టు తీయడం కూడా ఒకటని చెప్పవచ్చు. వెల్లుల్లి తొక్క తీయడం చాలా సులభం అనిపించినా, నిజానికి వాటి పొట్టు తీయడం మొదలుపెడితే మాత్రం సమయం ఎక్కువ తీసుకుంటుంది. చిన్న చిన్న రెబ్బలు, గట్టిగా అతుక్కున్న తొక్క.. అబ్బో ఇలా ఎన్నో సమస్యలు. ముఖ్యంగా త్వరగా వంట పూర్తి చేయాలనుకునే సమయంలో ఇది మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే చెఫ్స్, వంటలో ప్రాముఖ్యం ఉన్నవారు మాత్రం కొన్ని సెకన్లలోనే వెల్లుల్లి తొక్క తీసేస్తారు. దానికి కారణం కొన్ని సింపుల్, తెలివైన కిచెన్ ట్రిక్స్ అంటే నమ్ముతారా. అవునండి, మరి అవేంటో ఇప్పుడు చూద్దామా..

Egypt: ఈజిప్ట్ సమాధిలో అద్భుత ఆవిష్కరణ.. 3,000 ఏళ్ల నాటివి కూడా చెక్కు చెదరకుండా..

షేక్ చేసే ట్రిక్‌:
ఒకేసారి ఎక్కువగా వెల్లుల్లి తొక్క తీయాల్సి వస్తే, ఈ పద్ధతి చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. ముందుగా వెల్లుల్లి రెబ్బలను వేరు చేసి, వాటిని ఒక మూత ఉన్న డబ్బాలో లేదా స్టీల్ బాక్స్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత దానిని 10 నుంచి 15 సెకన్ల పాటు బాగా షేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల రెబ్బలు ఒకదానితో ఒకటి తగిలి, తొక్కలు సడలిపోతాయి. వాటిని షేక్ చేసిన తర్వాత డబ్బా తెరిచినప్పుడు చాలా రెబ్బలు కొన్ని తొక్క వదిలేసి ఉంటాయి. ఈ పద్ధతి సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తుంది.

కత్తితో సింపుల్‌గా:
కొద్దిగా వెల్లుల్లి మాత్రమే అవసరమైతే ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుంది. ఒక వెల్లుల్లి రెబ్బను కటింగ్ బోర్డ్‌పై పెట్టి, కత్తి ఫ్లాట్ సైడ్‌ తో నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఇలా చేస్తే తొక్క చిట్లి సులభంగా వదులుతుంది. అయితే చాలా బలంగా నొక్కకూడదు, లేదంటే వెల్లుల్లి మెత్తబడిపోతుంది. వెంటనే వంటలో ఉపయోగించాలనుకునే సమయంలో ఇది బెస్ట్ ట్రిక్ గా పనిచేస్తుంది.

MS Dhoni Comeback: చెన్నై ఊపిరి పీల్చుకో.. ధోని తోపాటు ఆ స్టార్ ప్లేయర్ ఈజ్ బ్యాక్..!

నీటిలో నానబెట్టే పద్ధతి:
ఈ సమస్యను ఇంకా సులభంగా చేయాలనుకుంటే నీటిలో నానబెట్టే పద్ధతిని ప్రయత్నించండి. వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటిలో సుమారు 5 నిమిషాలు నానబెట్టాలి. దీంతో తొక్కలు మృదువై, వాటంతట అవే వదులుతాయి. ముఖ్యంగా కొంచెం ఎండిపోయిన లేదా పాత వెల్లుల్లికి ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది. ఈ ట్రిక్స్‌ను పాటిస్తే వెల్లుల్లి తొక్క తీయడం చాలా సులువు.