Reading Time: 2 minutes
Mangli: సింగర్ మంగ్లీ వివాదంలో మరో ట్విస్ట్.. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేశారంటూ..

సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు ఫైలయింది. అధిక లాభాల ఎరతో మంగ్లీ సోదరుడు సహా మరికొందరి పది కోట్లకు పైగా మోసం చేశారనేది అభియోగం. మంగ్లీ ప్రచారం చేయడంతో 200 మంది పెట్టుబడులు పెట్టారన్నారు లాయర్‌ సుబ్బారావు.కొంతమంది బాధితులు మంగ్లీకే డైరెక్ట్‌గా డబ్బులు ఇచ్చారన్నారు. మోసంపై మంగ్లీని ప్రశ్నిస్తే తనపై బెదిరింపులకు దిగారన్నారు సుబ్బారావు. నిందితులు దాదాపు 2వందల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని, బ్యాక్‌ఎండ్‌లో మంగ్లీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ వుందన్నారు. తనను ఆశ్రయించిన బాధితులే సుమారు 10 కోట్లు మోసపోయారన్నారు.

అప్పట్లో ఊపేసిన నాగమ్మ సీరియల్‌.. నాగదేవతగా చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మంగ్లీ సహా సోదరుడు శివ, డైరెక్టర్‌ వేణు ఉడుగులపై BNS 351 ఆఫ్‌ 2, 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.తనకు మంగ్లీ అండ్‌ కో నుంచి ప్రాణహాని వుందన్నారు లాయర్‌ సుబ్బారావు. ఇదిలా ఉంటే ఈ వివాదం పై మంగ్లీ స్పందించారు. లాయర్ సుబ్బారావు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు మంగ్లీ. అతని కంటే ముందే తాను నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేస్తున్నారని ఆరోపించారామె. ఆ డబ్బుతో తనకేం సంబంధంలేదన్నారు సింగర్ మంగ్లీ.

రఘువరన్ చివరి రోజుల్లో అంత బాధను అనుభవించారా.! మద్యానికి బానిసై చివరకు

తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుబ్బారావు పై ఫిర్యాదు చేశారు మంగ్లీ.  150 కోట్ల మోసం చేశారంటూ తనపై సుబ్బారావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మార్చి 21 న సుబ్బారావు పేరుతో తనను పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించాడని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని ఆమె ఆరోపించారు. తనను కలవాలని ఒత్తిడి చేసినట్టు, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు మంగ్లీ. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు, తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా సుబ్బారావు తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?

 

View this post on Instagram

 

A post shared by Mangli 🎙 (@iammangli)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.