Reading Time: 2 minutes

గ్యాస్ కష్టాలకు చెక్.. నీళ్లతో నడిచే హైడ్రోజన్ స్టవ్.. ధర ఎంతంటే..

Caption of Image.

ఒక్క యుద్ధం ప్రపంచాన్ని డైలెమాలో పడేసింది. ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగటం..  గ్యాస్ సిలిండర్ల కొరతతో వంటకు ఇబ్బందులు ఏర్పడటం ఆలోచనలో పడేసింది. భవిష్యత్తులో కూడా గ్యాస్ కష్టాలు వస్తే.. గ్యాస్ సరఫరా ఆగిపోతే ఏంటి పరిస్థితి.. కరెంటుతో నడిచే ఇండక్షన్ స్టవ్లు ఉన్నా.. కరెంటుపైన ఎప్పుడూ ఆధారపడలేం కదా. అందులోనూ కరెంటుపైన చేసే వంట ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ పరిస్థితుల్లోనే వచ్చింది హైడ్రోజన్ గ్యాస్ స్టవ్ ఆలోచన. గ్యాస్, కిరోసిన్, కరెంటు అవసరం లేకుండా కేవలం నీటితో పనిచేసే స్టవ్ అందుబాటులోకి వస్తుండటం శుభపరిణామం.

ఒకప్పుడు ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవారు. వంట కోసం కట్టెలు, బొగ్గులను వినియోగించేవారు. కానీ పట్టణీకరణ పెరిగిపోవడం.. సిటీల్లోకి వలసలు పెరగటం.. దానికి తోడు అడవులు తగ్గిపోతుండటంతో గ్యాస్ వినియోగం వైపు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కానీ గ్యాస్ పై కొన్ని దేశాలపై ఆధారపడే పరిస్థితి.. ఉండటంతో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురైతే ఏంటనే ప్రశ్నే హైడ్రోజన్ స్టవ్ ల ఆవిష్కరణకు నాంది పలికింది. 

  • ధర ఎక్కువే..

ఎల్పీజీ సిలిండర్ అవసరం లేకుండానే వంట చేసుకునే సదుపాయం హైడ్రోజన్ సిలిండర్ ద్వారా కలుగుతుంది. అయితే ధర మాత్రం సామాన్యులు కొనలేని దగ్గర ఉంది. ఒక్క స్టవ్ ధర లక్షా 50 వేలు (1,50,000) రూపాయలు ఉంది. ప్లగ్ అండ్ యూజ్ సిస్టమ్ ద్వార పనిచేసే స్టవ్.. గ్రీన్ హైడ్రోజన్ ను వినియోగించుకుని మండుతుంది. గృహ, కమర్షియల్ వినియోగానికి రెండింటికీ పనిచేసేలా తయారు చేశారు. ఈ మేడిన్ ఇండియా స్టవ్ పైన ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. 

  •  ఏంటి ప్రత్యేకత?

ఇది రెగ్యులర్ గ్యాస్ స్టవ్ లాంటిది కాదు. పూర్తిగా హైడ్రోజన్‌తో పనిచేసేలా తయారు చేశారు. ఇంధనంగా 100% గ్రీన్ హైడ్రోజన్‌ తో పనిచేస్తుంది. 2 బర్నర్‌లతో, స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో తయారు చేశారు. హోమ్, కమర్షియల్ కిచెన్లు రెండింటికీ ఉపయోగించవచ్చు.

  • ఎలా పనిచేస్తుంది?

ఈ పొయ్యి క్యాటలిటిక్ (ఉత్ప్రేరక) హైడ్రోజన్ బర్నర్‌ ఆధారంగా పనిచేస్తుంది. అంటే.. హైడ్రోజన్‌ను ప్రధాన ఇంధనంగా ఉపయోగిస్తారు. చాలా తక్కువ మంటతో లేదా దాదాపు మంట లేకుండానే వేడి వస్తుంది. ఎల్‌పిజి స్టవ్‌ల మాదిరిగా స్టోర్ చేసిన  గ్యాస్ సిలిండర్ల ద్వారా కాకుండా హైడ్రోజన్ సరఫరా ద్వార  పనిచేస్తుంది. దీని ద్వారా పొల్యుషన్ ఉండదు. అంటే జీరో ఎమిషన్స్ (సున్నా ఉద్గారాలను) విడుదల చేస్తుంది. అంటే  కార్బన్ మోనాక్సైడ్ (CO) ఉండదు. పొగ కనిపించదు. దీనిపై మరింత పరిశోధన జరుగుతోంది. 

©️ VIL Media Pvt Ltd.