
హైదరాబాద్: పోక్ సింగర్ మంగ్లీపై కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట తన దగ్గర పది కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పది కోట్లు అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని, ఆమెతో తనకు ప్రాణహాని ఉందని ఆరోపణలు చేశాడు. దాదాపు 150 మందిని మోసం చేశారని, దర్శకుడు వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో ఉన్నాడని బాధితుడు ఆరోపణలు చేశాడు.