Reading Time: 2 minutes
Bajaj Pulsar: పల్సర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ వచ్చేసిన ‘లెజెండ్’.. కొత్త ఫీచర్లు, తక్కువ ధరతో బజాజ్ పల్సర్ లాంచ్!

Bajaj Pulsar: భారతీయ రోడ్లపై ‘స్పోర్ట్స్ బైక్’ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బజాజ్ పల్సర్. పల్సర్ బ్రాండ్ ప్రారంభమై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, బజాజ్ ఆటో తన ఐకానిక్ మోడల్ పల్సర్ 180ని సరికొత్త హంగులతో మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. సుమారు మూడేళ్ల విరామం తర్వాత ఈ లెజెండరీ బైక్ రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం. కొత్త 2026 బజాజ్ పల్సర్ 180 ధరను కంపెనీ రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ఇది పల్సర్ 150, పల్సర్ 220F మోడళ్ల మధ్యలో నిలుస్తుంది. ఇది సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది.

స్టైలిష్ డిజైన్, కొత్త ఫీచర్లు:

పల్సర్ 180 తన పాత మజిల్ లుక్‌ను అలాగే ఉంచుకున్నప్పటికీ, నేటి కాలానికి తగ్గట్టుగా కొన్ని ఆధునిక మార్పులు చేసింది. ఇప్పుడు ఇందులో కొత్త LED హెడ్‌ల్యాంప్, LED ఇండికేటర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన సరికొత్త డిజిటల్ ఎల్‌సీడీ కన్సోల్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా మీరు కాల్స్, మెసేజ్ అలర్ట్స్ పొందవచ్చు. ఇక కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే ఇది ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. బ్లాక్-బ్లూ, బ్లాక్-గోల్డ్, బ్లాక్-గ్రే, బ్లాక్-రెడ్, వైట్.

ఇది కూడా చదవండి: Gold Reserves: అత్యధిక బంగారం ఏ దేశం వద్ద ఉంది? భారత్‌ ఏ స్థానంలో? టాప్‌ -5 దేశాలు ఇవే!

ఇంజిన్ సామర్థ్యం (Engine Specs): ఈ బైక్‌లో శక్తివంతమైన 178.6cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను వాడారు. 8,500 rpm వద్ద 17 bhp శక్తిని విడుదల చేస్తుంది. 6,500 rpm వద్ద 15 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ బాక్స్ విషయానికొస్తే ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది.

హార్డ్‌వేర్, బ్రేకింగ్:

ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం అత్యుత్తమ హార్డ్‌వేర్‌ను బజాజ్ అందించింది. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. ముందు 280 mm డిస్క్, వెనుక 230 mm డిస్క్ బ్రేక్స్ అమర్చారు. 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పై ఈ బైక్ నడుస్తుంది. ఇక బరువు, కెపాసిటీ విషయంలో బైక్ బరువు 156 కిలోలు. ఇందులో 15 లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇది లాంగ్ రైడ్స్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఇది కూడా చదవండి: YouTube Channel: AI సాయంతో యూట్యూబ్ ఛానెల్.. ఈ ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్.. భారీ ఆదాయం!

ఇది కూడా చదవండి: AC Servicing: సర్వీసింగ్ చేయించిన తర్వాత కూడా మీ ఏసీ కూలింగ్‌ కావడం లేదా? ఇదే ప్రధాన కారణం కావచ్చు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి