Reading Time: < 1 minute

మైనర్ బాలికపై మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… గోల్నాక, తులసీరామ్ నగర్‌కు చెందిన మైనర్ బాలిక (13)కు ఇన్‌స్ట్రాగ్రామ్ రీల్స్ ద్వారా కాచిగూడ, గోల్నాక ప్రాంతానికి చెందిన బాలుడు పరిచయమయ్యాడు. మైనర్ బాలికతో స్నేహం పెంచుకొని ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడిని జువెనైల్ కోర్టులో హాజరు పరిచి జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు.