
హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రెండున్నరేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..దశాబ్దాలుగా అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ రైతుబంధు ను సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ రెండు సార్లు ఎగ్గొట్టిందని, కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ వంటి పథకాలను నీరుగార్చారని జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ పాలనలో రాష్ట్రం తిరోగమన బాట పట్టిందని, కాంగ్రెస్ పాలనకు విసుగెత్తి మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ పోవాలని.. కెసిఆర్ రావాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రజాహితం కోసం రాష్ట్ర సాధకుడు కెసిఆర్ వెంటే నడుస్తానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.