Reading Time: < 1 minute

 న్యూఢిల్లీ:  డీజిల్‌ ఎగుమతిపై సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. డీజిల్ ఎగుమతిపై సుంకాన్ని లీటరుకు రూ.21.5 నుంచి రూ. 55.5కు పెంచినట్లు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, విమాన ఇంధనం (ATF)పై కూడా సుంకాన్ని పెంచింది. ATFపై సుంకాన్ని లీటరుకు రూ.29.5 నుంచి రూ. 42కు పెంచింది. ఈ సుంకాల పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అయితే, పెట్రోల్‌ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పు లేదని.. యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది.

కాగా,  పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, దేశీయంగా ఇంధన లభ్యతను పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 26న డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ. 21.50, ATFపై లీటరుకు రూ. 29.5 చొప్పున ఎగుమతి సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.