Reading Time: 2 minutes
Tollywood : ఈ దుర్మార్గుడే సర్.. ఆ నటుడిపై చిరంజీవికి కంప్లైంట్ చేసిన సౌందర్య.. అసలేం జరిగిందంటే..

నటుడు సత్య ప్రకాష్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, విలన్‌గా తన ఇమేజ్, అలాగే నటీమణులపై వచ్చిన ఆరోపణలు, చిరంజీవి స్ఫూర్తి వంటి అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. చిన్నతనం నుంచే సినిమా పట్ల తనకు విపరీతమైన ప్రేమ ఉండేదని, ఒడిశాలో నివసించిన సమయంలో విజయనగరానికి వచ్చి చిరంజీవి గారి సినిమాలు చూసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లోనే చిరంజీవి గారి స్టైల్ అనుకరించడానికి ప్రయత్నించానని, హిందీ సినిమాలను చూసి అమితాబ్ బచ్చన్ నటనకు ప్రభావితమయ్యానని తెలిపారు. చదువు కంటే సినిమాపైనే ఎక్కువ ఆసక్తి ఉండేదని పేర్కొన్నారు. పోలీస్ స్టోరీ చిత్రంతో తన సినీ ప్రస్థానం ప్రారంభమైందని, ఆ చిత్రంలో దర్శకుడు తన అసలు పేరు అయిన సత్యనే తన పాత్రకు పెట్టారని సత్య ప్రకాష్ వివరించారు. ఇది కేవలం తాను నటించిన పాత్రల వల్లే వచ్చిందని, నిజ జీవితంలో తాను రేపిస్ట్‌ను కాదని, సీరియల్ కిల్లర్‌ను కాదని స్పష్టం చేశారు. ఈ ట్యాగ్ వల్ల బాధపడటం లేదా కన్నీళ్లు పెట్టుకోవడం వంటివి అనవసరం అని అన్నారు.

నటి సౌందర్యతో పెళ్లి చేసుకుందాం సినిమాలో ఆత్యాచార సన్నివేశంపై వచ్చిన ఆరోపణలను సత్య ప్రకాష్ ఖండించారు. ఆ సన్నివేశం కేవలం సింబాలిక్ ఆత్యాచారం సీన్ అని, తాను సౌందర్యను తాకలేదని వివరించారు. ఆ సినిమాలో వర్షంలో నడిచి వస్తున్న సౌందర్యను ఒక వ్యాన్‌లోకి తీసుకెళ్లడం, తర్వాత వ్యాన్‌ను ఊపడం, చివరకు ఆమె బయట పడిపోవడం వంటివి చూపించారని తెలిపారు. ఇది పూర్తిగా సాంకేతికమైన సన్నివేశమని, రేప్ సీన్‌లో తనకు ఫ్రీగా నటించడం రాలేదని, స్వయంగా సౌందర్యనే దర్శకుడితో “ఈ సత్య ప్రకాష్‌కి ఆత్యాచారం చేయడం రాదు, మీరు చెప్పండి, నేనే సత్య ప్రకాష్‌ను ఆత్యాచారం చేస్తాను” అని సరదాగదా చెప్పిందని సత్య ప్రకాష్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత, చూడాలని ఉంది సినిమా షూటింగ్‌లో చిరంజీవిని కలవడానికి వెళ్లినప్పుడు సౌందర్య తన జీవితంలో ఒకే ఒక సినిమాలో ఆత్యాచారం  సీన్ జరిగిందని, అది కూడా ఈ దుర్మార్గుడే చేశాడని తన గురించి చెప్పిందని ఆయన పేర్కొన్నారు.

తన కెరీర్‌లో మార్పు వచ్చిందని, ప్రస్తుతం విలన్ పాత్రల నుంచి తండ్రి, సహాయక పాత్రల వైపు మారుతున్నానని సత్య ప్రకాష్ తెలిపారు. ఇటీవల విడుదలైన 90ML చిత్రంలో తన తండ్రి పాత్రకు మంచి ప్రశంసలు లభించాయని, ప్రస్తుతం మూడు, నాలుగు చిత్రాల్లో దాదాపు హీరోకు సమానమైన పాత్రలు చేస్తున్నానని వెల్లడించారు.

Soundarya, Satya Prakash

Soundarya, Satya Prakash

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..