
రాష్ట్ర పోలీసు కృషితో రెండు సంవత్సరాల్లో 761 మంది మవోయిస్టులు లొంగిపోయారని డిజిపి వెల్లడించారు. అత్యధికంగా గతేడాది 509 మంది లొండిపోగా ఈ సంవత్సరం నాలుగు నెలల వ్యవధిలోనే 205 మంది జనజీవన స్రవంతిలోకి కలిసినట్లు డిజిపి పేర్కొన్నారు. దీంతో పాటు రెండు సంవత్సరాల్లో వివిధ రాకాలకు చెందిన 302 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకోగా, వాటిలో అత్యాధునిక ఇజ్రాయల్, అమెరికా తయారీ తుపాకులు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన 125 మంది మవోయిస్టుల్లో వివిధ క్యాడర్లలో పనిచేసే వారు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుకు తగ్గిందని డిజిపి తెలిపారు. ఇది పోలీసుల పనితీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు.