
శ్రీనగర్: 2026వ సంవత్సరానికి అమర్‌నాథ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 554 నియమిత బ్యాంక్ శాఖల ద్వారా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని అమర్‌నాథ్‌జీ ష్రైన్ బోర్డ్ (ఎస్ఏఎస్బీ) వెల్లడించింది.
రిజిస్ట్రేషన్లు ‘మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత’ ఉంటుంది. ప్రతి మార్గానికి రోజువారీ కోటా నిర్ణయించారు. ఈసారి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపు ప్రక్రియను తప్పనిసరి చేశారు. పర్మిట్లను ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనున్నారు. 13 నుంచి 70 ఏండ్లలోపు వారు మాత్రమే ఈ యాత్రకు అర్హులుగా పేర్కొన్నారు.