Reading Time: 2 minutes
Lifestyle: గ్యాస్ స్టవ్ జిడ్డు పట్టిపోయి ఉందా.? ఇలా చేస్తే క్షణాల్లో తళతళ మెరిసిపోతుంది..

వంటగదిలో పని అంటే కేవలం వండటమే కాదు, సమయాన్ని నిర్వహించడం కూడా. ఉదయం వేళ హడావిడిలో ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు పనులను ఆలస్యం చేస్తుంటాయి. అలాంటి సమయాల్లో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే పనులను ఎలా సులభతరం చేసుకోవచ్చో, సమయాన్ని ఎలా ఆదా చేయవచ్చో ఈ చిట్కాలు చూసేయండి. ఇవి మీ శ్రమను తగ్గించడమే కాకుండా వస్తువుల వృథాను కూడా అరికడతాయి.

ఇది చదవండి: అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.. ఎందుకంటే.?

బంగాళాదుంపల తొక్క తీయడం, మ్యాషింగ్..

బంగాళాదుంపలు ఉడికించిన వెంటనే అవి చాలా వేడిగా ఉంటాయి. ఆ సమయంలో చేత్తో తొక్క తీయడం కష్టంగా అనిపిస్తే, ఒక ఫోర్క్‌ను దుంపకు గుచ్చి పట్టుకుని తొక్క తీస్తే వేడి తగలకుండా పని పూర్తవుతుంది. అలాగే మీ దగ్గర ‘మ్యాషర్’ లేనప్పుడు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒక ఎత్తైన స్టీల్ గ్లాసును తీసుకుని దాని అడుగు భాగంతో నొక్కితే బంగాళాదుంపలు త్వరగా, మెత్తగా తయారవుతాయి.

సరుకులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి

కిరాణా సరుకుల ప్యాకెట్లు విప్పిన తర్వాత మిగిలిన సరుకు గాలి తగిలితే పాడైపోయే అవకాశం ఉంది. దీనికోసం ఒక పాత ప్లాస్టిక్ బాటిల్ పైభాగాన్ని(మూత ఉన్న వైపు) కట్ చేసి, ప్యాకెట్ లోపలి నుంచి తీసి మూత బిగించండి. ఇలా చేయడం వల్ల ప్యాకెట్లోకి గాలి చొరబడదు, పురుగులు పట్టవు, సరుకులు చాలా కాలం తాజాగా ఉంటాయి.

దుర్వాసనను లేకుండా..

వాషింగ్ మెషీన్ లేదా బాత్రూమ్ నుంచి వచ్చే ఒక రకమైన తడి వాసనను నివారించడానికి సహజమైన చిట్కా ఉంది. మనం వాడి పారేసే నిమ్మ తొక్కలను పారేయకుండా, ఒక పాత మాస్క్‌లో వేసి ముడి కట్టండి. దీన్ని మెషీన్ లోపల లేదా బాత్రూమ్‌లో ఒక మూలన తగిలిస్తే, నిమ్మ తొక్కలు సహజమైన ‘ఫ్రెషనర్’లా పనిచేసి దుర్వాసనను పోగొట్టి మంచి సువాసనను ఇస్తాయి.

స్టవ్ జిడ్డును వదిలించే చిట్కా

వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ మీద నూనె జిడ్డు పడటం సహజం. ఆ జిడ్డును వదిలించడానికి సాధారణ ఫేస్ పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది. జిడ్డు పడిన చోట కొంచెం పౌడర్ చల్లి కాసేపు ఉంచి తుడిస్తే, ఆ జిడ్డును పౌడర్ పీల్చుకుని స్టవ్ తళతళలాడుతుంది.

చట్నీని సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చే సులభ మార్గం

ఫ్రిజ్‌లో ఉంచిన చట్నీని తినే ముందు అది చాలా చల్లగా ఉంటుంది. దాన్ని వెంటనే వాడాల్సి వస్తే, ఒక ‘హాట్‌బాక్స్‌’లో గోరువెచ్చని నీళ్లు పోసి, అందులో చట్నీ గిన్నెను ఉంచండి. కేవలం రెండు నిమిషాల్లో చట్నీ గది ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. దీనివల్ల రుచి మారదు. ఆరోగ్యానికి కూడా మంచిది.

ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..