
న్యూఢిల్లీ:ఆన్లైన్ మోసాలను అడ్డుకోవడానికి ఆర్బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. డిజిటల్ లావాదేవీల రక్షణ కోసం గంట సమయం కూలింగ్ పీరియడ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. రూ.10 వేలు దాటిన యూపీఐ, ఐఎమ్పీఎస్ వంటి తక్షణ నగదు బదిలీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. కేవలం వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) జరిగే బదిలీలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వెరిఫైడ్ మర్చంట్లకు చేసే చెల్లింపులపై దీని ప్రభావం ఉండదు.
వినియోగదారులు ముందే ఆమోదించిన లబ్ధిదారులకు చేసే చెల్లింపులకు కూడా ఈ రూల్వర్తించదు. 2021లో రూ.551 కోట్లుగా ఉన్న సైబర్ మోసాల విలువ 2025 నాటికి రూ.22, 931 కోట్లకు చేరింది. రూ.10 వేలకు పైబడిన లావాదేవీల్లోనే 98.5 శాతం మోసాలు జరుగుతున్నాయని ఆర్బీఐ గుర్తించింది. ఇదిలా ఉంటే, కస్టమర్ తనకు ఏదైనా డిజిటల్ ఫ్రాడ్ జరిగిందని భావిస్తే ఇక నుంచి కిల్ స్విచ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని యాక్టివేట్ చేస్తే డిజిటల్ చెల్లింపులు అన్నీ ఆగిపోతాయి.