
సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు టిపిసిసి నడుస్తుందని జీవన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి వల్ల అధిష్టానం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుందని పేర్కొన్నారు. కెసిఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, ఆ సభకి కెసిఆర్‌ను ముఖ్య అతిథులుగా రావాలని విజ్ఞప్తి చేశానని, అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. తాను అధికార బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్ళట్లేదని అన్నారు. పదవుల కోసమే బిఆర్‌ఎస్‌లోకి వెళ్లాలంటే తాను పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళేవాడిని అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అని, ఇచ్చింది 17 వేల ఉద్యోగాలు మాత్రమే అని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని, రెండో సంవత్సరం లక్ష ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. ఈ రెండేళ్లు అయినా ప్రజాహితం కోసం పని చేయాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైందని అన్నారు.-