Reading Time: < 1 minute
Director Ravibabu Crime Thriller Razor Movie Release Date Confirmed

టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ రవిబాబు మళ్ళీ తన ఫేవరెట్ జోనర్‌లోకి అడుగుపెట్టారు. అల్లరి, అనసూయ, అవును వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఆయన, ఇప్పుడు ‘రేజర్’ (Razor) అనే పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. రవిబాబు సినిమాల్లో ఉండే టెక్నికల్ గ్రాండియర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉండబోతున్నాయని సమాచారం.

Also Read : Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..

ప్రస్తుతం థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, రవిబాబు తన మార్క్ మేకింగ్‌తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వేసవి కానుకగా మే 8న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లింప్స్ లోని వైలెన్స్ చూస్తుంటే, రవిబాబు ఈసారి మామూలు సినిమా తీయలేదని అర్థమవుతోంది. మొత్తనికి ఈ సమ్మర్ లో మాస్, క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి ‘రేజర్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.