Reading Time: < 1 minute
Fact Check Jana Nayagan Leak Rumors Cbfc Official Clarification

Fact Check: గత కొన్ని రోజులుగా విజయ్ ‘జన నాయగన్’ సినిమా లీక్ గురించి వస్తున్న వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కార్యాలయం నుంచే లీక్ అయిందన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపగా ఈ ఆరోపణలను సెన్సార్ బోర్డు తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలన్నీ అవాస్తవాలని, కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేసింది.

READ ALSO: Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం, ఒక సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. ఈ ప్రక్రియలో ఉపయోగించే సాంకేతికత గురించి CBFC కీలక విషయాలను వెల్లడించింది. సినిమాల సర్టిఫికేషన్ కోసం CBFC కేవలం సురక్షితమైన KDM వ్యవస్థను మాత్రమే అనుసరిస్తుంది. సినిమాలో ఉన్న కంటెంట్ మొత్తం పాస్‌వర్డ్ ద్వారా రక్షించబడుతుంది. ఈ పాస్‌వర్డ్/ యాక్సెస్ కీ కేవలం నిర్మాత వద్ద మాత్రమే ఉంటుంది. సరైన KDM కోడ్ లేకుండా ఆ సినిమాను చూడటం కానీ, డౌన్‌లోడ్ చేయడం కానీ ఎవరికీ సాధ్యపడదు. బోర్డు సభ్యులు కూడా కేవలం రివ్యూ కోసం మాత్రమే ఆ ఫైల్‌ను యాక్సెస్ చేయగలరు.

ఇక సెన్సార్ బోర్డు చెబుతున్న ప్రకారం మార్చి 17వ తేదీన ముంబైలో ఈ సినిమా DCPని అధికారికంగా దరఖాస్తుదారుడైన నిర్మాతక అప్పగించడం జరిగింది. దానికి సంబంధించిన రశీదు కూడా బోర్డు వద్ద ఉంది. ఆ రోజు నుంచి ఈ డిజిటల్ ప్యాకేజీ మొత్తం నిర్మాత పర్యవేక్షణలోనే ఉందని, బోర్డు బాధ్యత సర్టిఫికేషన్ పూర్తయిన వెంటనే ముగిసిందని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈ క్రమంలో ‘జన నాయకన్’ చిత్రం CBFC నుండి లీక్ అయిందనే వార్తలు కేవలం కల్పితమని, వాటిని ఎవరూ నమ్మకూడదని CBFC వర్గాలు కోరుతున్నాయి.

READ ALSO: Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..