
నెహ్రూ రింగ్ రోడ్డుకు 30 కిలో మీటర్ల వెలుపల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. దానికి అనుబంధంగా రేడియల్ రోడ్లు ఏర్పాటవుతున్నాయిని వివరించారు. రింగ్ రోడ్ల పక్కన రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసి రవాణా సదుపాయాలను ప్రపంచంలోని పెద్ద నగరాలను తలదన్నేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. హయత్ నగర్-, ఎల్.బి.నగర్ మధ్య డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మిస్తున్నాట్టు వివరించారు. కింది రోడ్డు స్థానిక ట్రాఫిక్ అవసరాలకు వినియోగిస్తామని,
పైన ఉండే రెండు అండు అంతస్థుల రోడ్లు నగరం నుంచి వెలుపలకు, లోపలకి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకిస్తామని చెప్పారు. నాగపూర్ తర్వాత డబుల్ డెక్కర్ రోడ్లు నిర్మిస్తున్న నగరం ఇదేనని పేర్కొన్నారు. రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో పికో టెక్నాలజి వ్యవస్థాపక సిఇఒ జారొడ్ యుస్టర్, పికో ఇండియా సిఇఒ హరి కోదండరామన్, డైరెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.