Reading Time: < 1 minute

ముంబయి: మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజల ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఒక్కసారిగా ప్రాణభయంతో వణికిపోయారు. నాందేడ్‌, పర్బిని జిల్లాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది.