
గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బర్సాపరా స్టేడియం వేదికగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ వేయడం ఆలస్యమైంది. అయితే వర్షం తగ్గు ముఖం పట్టడంతో 8.15 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఆడిన మ్యాచుల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయిట్ల టేబుల్‌లో మొదటి స్థానం దక్కించుకొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ ఒక మార్పు చేసింది. తుషార్‌కి విశ్రాంతి ఇచ్చి.. బ్రిజేష్‌ని జట్టులోకి తీసుకుంది. ఆర్‌సిబి కూడా ఒక మార్పు చేసింది. డఫ్ఫీ స్థానంలో హేజిల్‌వుడ్‌ని జట్టులోకి తీసుకుంది. అయితే టాస్ జరిగిన వెంటనే మళ్లీ వర్షం తిరిగి ప్రారంభమైంది. దీంతో అభిమానులు నిరాశ గురవుతున్నారు.
తుది జట్లు:
ఆర్ఆర్: యశస్వీ జైస్శాల్, ధృవ్ జురెల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డానొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.
ఆర్‌సిబి: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్.