
Avakaya Pulihora Recipe: సాధారణంగా పులిహోర అంటే చింతపండు లేదా నిమ్మకాయతో చేస్తాం. కానీ, తెలుగు ప్రజలకు అందులో ఆంధ్రులకు అత్యంత ఇష్టమైన ఆవకాయ పచ్చడితో చేసే ‘ఆవకాయ పులిహోర’ రుచి అద్భుతంగా ఉంటుంది. కారంకారంగా, పుల్లపుల్లగా ఉండే ఈ రైస్ రెసిపీ లంచ్ బాక్స్ లోకి, ఇన్స్టంట్‌గా ఏదైనా టేస్టీగా తినాలనుకున్నప్పుడు బెస్ట్ ఛాయస్ అవుతుంది. ఆవకాయ పులిహోరను పక్కా కొలతలతో రుచిగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం.
IPL Records: ముకుల్ సూపర్ ఫినిష్.. KKRకు చెత్త రికార్డు.!
కావలసిన పదార్థాలు:
* బియ్యం: 250 గ్రాములు (ఒక గ్లాసు)
* ఆవకాయ పచ్చడి (ఊటతో కలిపి): పావు కప్పు
* నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు
* నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
* పసుపు: అర టీస్పూన్
* నూనె: తాలింపుకు సరిపడా
* నెయ్యి: 1 టేబుల్ స్పూన్
* వేరుశెనగ గుళ్లు: పావు కప్పు
* తాలింపు దినుసులు: శెనగపప్పు (2 స్పూన్లు), మినప్పప్పు (1 స్పూన్), ఆవాలు (1 స్పూన్), జీలకర్ర (అర స్పూన్)
* అల్లం తురుము: అర ఇంచు ముక్క
* పచ్చిమిర్చి: 2 (చీలికలు)
* ఎండుమిర్చి: 3
* కరివేపాకు: రెండు రెమ్మలు
* ఇంగువ: పావు టీస్పూన్
* ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
అన్నం సిద్ధం చేసుకోవడం:
ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, కుక్కర్‌లో వేయాలి. ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు, కొంచెం నూనె వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అన్నం పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి.
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..
నువ్వుల పొడి తయారీ:
స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేయాలి. సన్నటి సెగ మీద దోరగా వేయించి, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
రైస్ మిక్సింగ్:
ఉడికించిన అన్నం వేడిగా ఉన్నప్పుడే అందులో పసుపు, మనం సిద్ధం చేసుకున్న నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. అన్నం కాస్త గోరువెచ్చగా అయ్యాక, పావు కప్పు ఆవకాయ పచ్చడి (ముక్కలు), ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి అన్నం మొత్తానికి పట్టేలా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా ఉప్పు సర్దుబాటు చేసుకోవాలి.
తాలింపు:
పాన్‌లో రెండు స్పూన్ల నూనె, ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో ముందుగా వేరుశెనగ పప్పులు వేసి దోరగా వేయించాలి. అవి వేగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయాలి. తాలింపు వేగుతుండగా అల్లం తురుము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. చివరగా పావు టీస్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.
ఫినిషింగ్:
ఈ వేడి వేడి తాలింపును కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నంలో వేసి బాగా కలియబెట్టాలి. అంతే.. ఎంతో రుచికరమైన, నోరూరించే ఆవకాయ పులిహోర సిద్ధం.