Reading Time: 2 minutes
ఆంధ్రాలో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుందంటే…?

అంతర ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర -దక్షిణ ద్రోణి/గాలి అంతరాయం దక్షిణ చత్తీశ్ఘడ్ ,విదర్భ, మరట్వాడ , అంతర కర్ణాటక ,అంతర తమిళనాడు ప్రాంతములో నున్న ఉపరితల ఆవర్తనం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. శుక్రవారం నాటి ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాలపై నున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1 .5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఈరోజు తక్కువగా గుర్తించబడినది . ఆంధ్ర ప్రదేశ్,  యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి . వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం

శనివారం, ఆదివారం :-తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

సోమవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

శనివారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

ఆదివారం, సోమవారం:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

శనివారం, ఆదివారం :-  తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

సోమవారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

గమనిక :- కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం మరియు రాయలసీమ లో రాగల 7 రోజుల్లో వేడి ,తేమ..  అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 7 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల .సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

Also Read: నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు టాప్ యాక్టర్..