
న్యూ చంఢీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసింది. ఆరంభంలో ఇన్నింగ్స్‌ని దూకుడుగా ఆరంభించిన సనరైజర్స్ ఆ తర్వాత అత్యంత స్లోగా బ్యాటింగ్ చేసింది. పవర్‌ప్లేలోనే 100 పరుగులు దాటినప్పటికీ.. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఔట్ కావడంతో ఇన్నింగ్స్ నెమ్మదించింది. ఓపెనర్లు అభిషేక్, హెడ్‌లు కలిసి తొలి వికెట్‌కి 120 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అభిషేక్ అర్థ శతకం కూడా సాధించాడు.
అయితే శశాంక్ ఈ జోడీకి బ్రేక్ వేశాడు. ఒకే ఓవర్‌లో హెడ్(38), అభిషేక్(74, 28 బంతుల్లో, 5ఫోర్లు, 8 సిక్సులు) లను ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లు నెమ్మదిగా స్కోర్ పెంచుతూ వెళ్లారు. అయితే 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కిషన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన అనికేత్ 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సుతో 18 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇక సాలిల్ అరోరా(9) అర్ష్‌దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆఖరి ఓవర్‌లో చివరి దాక పోరాడిన క్లాసెన్(39) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి.. పంజాబ్‌కి 220 పరుగుల టార్గెట్‌ని ముందుంచింది. పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్, శశాంక్‌లు చెరి రెండు, బ్రాట్‌లెట్ ఒక వికెట్ తీశారు.