
ఐపిఎల్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 220 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభుసిమ్రాన్(51)లు మెరుపు అర్ధ శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69తో పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో పంజాబ్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు చేసి గెలుపొందింది. సన్ రైజర్స్ బౌలర్లలో శివాంగ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్ దూబే ఒక వికెట్ తీశాడు. అంతకుముందు, హైదరాబాద్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్, శశాంక్‌లు చెరి రెండు, బ్రాట్‌లెట్ ఒక వికెట్ తీశారు.