కావాల్సిన పదార్దాలు: రెండు కప్పుల మజ్జిగ, ఒక కప్పు బెండకాయ, సొరకాయ, దొండకాయ ముక్కలు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక కప్పు కొబ్బరి తురుము, అర టేబుల్ స్పూన శెనగపప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి , కరివేపాకు, నూనెను తీసుకోవాలి.
ముందుగా కూరగాయలను తీసుకుని వాటిని శుభ్రపరచి, పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఇక ఇప్పుడు కొబ్బరి, శెనగపప్పు, జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మజ్జిగను తీసుకుని కవ్వంతో తిప్పి దానిని పేస్ట్ లాగా కలపాలి.
ఉడికిన కూరగాయల్లో ఈ మజ్జిగను పోసి మీడియం మంటపై అలాగే ఉంచాలి. అలా అని వాటిని బాగా మరిగించకూడదు. కొద్దిగా వేడయ్యే వరకు మాత్రమే ఉంచాలి.
ఇప్పుడు పాన్లో తీసుకుని దానిలో నూనె చేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును వేసి తాలింపు పెట్టుకుని ఈ పులుసులో దానిని కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోతోంది. ఇలా మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు.ఇంకా
వేసవిలో చల్లగా కూడా ఉంటుంది.




