
ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల అడవుల జిల్లా ఆదిలాబాద్ దశ మారబోతుందని అధికారులు భావిస్తున్నారు. అన్ని సవ్యంగా సాగితే రాబోయే మూడు సంవత్సరాలలోనే విమానాశ్రయం కార్యరూపం దాల్చనుంది. భారతీయ వాయుసేన స్టేషన్‌తో పాటు భారీ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్ణయించింది. ఈ మేరకు రక్షణ శాఖ పరిధిలోని 362 ఎకరాలకు తోడు మరో 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 1062 ఎకరాలతో విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెన్నై సమీపంలో గోల్డ్ షాపులో దోపిడీకి యత్నం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఇరాన్ అమెరికా చర్చల వేళ ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య పంచాయితీ