
ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. చర్చలు ఏమవుతాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. తాజా దాడుల్లో ముగ్గురు మృతిచెందారు.
దక్షిణ లెబనాన్‌లోని ఒక నివాస భవనంపై శనివారం ఇజ్రాయెల్ దాడి చేసింది. దక్షిణ లెబనాన్‌లోని నబాటియే జిల్లా మెఫాడౌన్ పట్టణంలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ప్రస్తుతం ముగ్గురు చనిపోయారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
అమెరికా-ఇరాన్ చర్చల్లో లెబనాన్ ఒక ప్రధాన డిమాండ్‌గా ఉంది. లెబనాన్‌పై తక్షణమే దాడులు ఆపాలని కోరింది. రెండు వారాల కాల్పుల విరమణలో లెబనాన్‌ను కూడా చేర్చాలని ఇరాన్ వాదిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం రెండు వారాల కాల్పుల విరమణలో లెబనాన్‌ను చేర్చలేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే వచ్చే వారం మంగళవారం వాషింగ్టన్ వేదికగా లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు అమెరికా శ్రీకారం చుట్టింది. అయితే శాంతి చర్చల వరకు దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను లెబనాన్ కోరింది. అలాగే అమెరికా కూడా సూచించింది. అందుకు ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా చర్చలు జరుపుతున్న తరుణంలోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ పరిణామాలు ఎలా దారి తీస్తాయో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: JD Vance: ఇస్లామాబాద్‌లో వింత మర్యాద.. చిన్నారితో జేడీ వాన్స్‌కు స్వాగతం