Reading Time: < 1 minute

 అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ – ‘వైశాఖి’ వేడుకలకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను గురుద్వారా ప్రతినిధులు ఆహ్వానించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ ఎస్.దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం శనివారం కెటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా మంగళవారం(ఏప్రిల్ 14) మధ్యాహ్నం 1.30 గంటలకు అమీర్‌పేట్‌లోని గురు గోవింద్ సింగ్‌జీ మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ (మున్సిపల్ ప్లే గ్రౌండ్స్)లో జరగనున్న

ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు.పంజాబ్‌కు చెందిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, ఈ వేడుకలకు సుమారు 8,000 నుండి 8,500 మంది భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు వివరించారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని వారు కెటిఆర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ అమీర్‌పేట్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.