Reading Time: < 1 minute

 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంచిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించాడు. తొలి బంతి నుంచే ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ధాటిగా ఆడిన జైస్వాల్ 8 బంతుల్లో 2 సిక్స్‌లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ధ్రువ్ జురెల్ అండతో వైభవ్ జోరును కొనసాగించాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన వైభవ్ వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన సూర్యవంశీ 26 బంతుల్లోనే 8 ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. తాజా సమాచారం లభించే సమయానికి రాజస్థాన్ 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును కెప్టెన్ రజత్ పటిదార్ (63), విరాట్ కోహ్లి (32) ఆదుకున్నారు.