Reading Time: < 1 minute
Ram Charan Peddi Movie Shoot Delay Item Song Heroine Hunt Rc16 Updates

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మెగా ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరోసారి వాయిదా పడింది. ఈ వారం ఒక భారీ సెట్‌లో సినిమాలోని ఒక స్పెషల్ ఐటెం సాంగ్ షూట్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని భావించిన మేకర్స్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కానీ, చివరి నిమిషంలో ఈ పాట చేసే హీరోయిన్ ఎంపిక ఇంకా కొలిక్కి రాకపోవడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇప్పటికే మానస వారణాసి లాంటి కొందరు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, సాంగ్ ఎనర్జీకి సరిపోయే సరైన హీరోయిన్ ను ఇంకా ఫైనల్ కాలేదు, ఆ అన్వేషణ కొనసాగుతోందని తెలుస్తోంది. మరోపక్క హీరో రామ్ చరణ్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం చిన్న బ్రేక్ తీసుకున్నారు. కుటుంబంతో సమయం గడపడం కోసం ఆయన అందుబాటులో లేకపోవడంతో షెడ్యూల్ మొత్తం రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చరణ్ బ్రేక్ నుంచి తిరిగి వచ్చాకే ఆ షూట్ మొదలుకానుంది. ఏదైనా సినిమా షూటింగ్ సాఫీగా సాగితేనే అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. కానీ ‘పెద్ది’ విషయంలో జరుగుతున్న వరుస వాయిదాలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం, మరోవైపు సమయం వృథా కావడం వల్ల సినిమా విడుదల తేదీపై ప్రభావం పడే అవకాశం ఉంది.