Reading Time: < 1 minute

శ్రీనగర్ లో అగ్నిప్రమాదం… మసీదులో మంటలు..

Caption of Image.

శ్రీనగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. మసీదులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురయ్యారు జనం. శుక్రవారం ( ఏప్రిల్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. శ్రీనగర్ లోని హైదర్పోరా ప్రాంతంలో జామియా అరేబియా అష్రఫుల్ ఉలూమ్‌ మసీదులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మసీదులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మసీదులోని పై అంతస్తులో భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. 

►ALSO READ | యూపీలో ఘోరం: యమునా నదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి 

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం అయితే జరగలేదని సమాచారం.

©️ VIL Media Pvt Ltd.