Reading Time: < 1 minute

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఆలస్యం.. చివరి నిమిషంలో ఏమైందంటే..?

Caption of Image.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న అమెరికా‎ఇరాన్ శాంతి చర్చలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం (ఏప్రిల్ 10) ఉదయం 8 గంటలకు చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో పీస్ టాక్స్ మధ్యాహ్నం తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ రౌండ్‎లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ప్రత్యక్ష చర్చల్లో పాల్గొనరు. ఇరుదేశాల ప్రతినిధుల మొదట పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‎తో వేర్వేరుగా భేటీ అవుతారు. తొలి దశ చర్చలు సాఫీగా సాగితే రాత్రికి ఇరుపక్షాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరుపుతారు. 

ఇప్పటికే అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఇస్లామాబాద్ చేరుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వంలోని ఇరాన్ టీమ్ శనివారం (ఏప్రిల్ 10) ఇస్లామాబాద్‎లో అడుగుపెట్టాయి. ఇరాన్ ప్రతినిధి బృందానికి పాక్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వాగతం పలికారు. జేడీ వాన్స్‌ బృందానికి పాక్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిఫ్‌ మునీర్‌ గ్రాండ్ వెలకమ్ చెప్పారు. 

►ALSO READ | మీ యుద్ధ రక్త దాహానికి బలైన చిన్నారులు వీళ్లే : 168 ఫొటోలు, స్కూల్ బ్యాగులతో చర్చలకు వచ్చిన ఇరాన్..

అమెరికా‎ఇరాన్ శాంతి చర్చల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇస్లామాబాద్‎లో హై అలర్ట్ ప్రకటించారు. నగరం మొత్తం లాక్ డౌన్ విధించి భారీగా బలగాలను మోహరించారు. చర్చలు జరగనున్న సెరెన్ హోటల్ పరిసరాల్లో కర్ఫ్యూ అమలు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ హై ప్రొఫైల్ భేటీకి దాదాపు 10 వేల మంది సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. 

©️ VIL Media Pvt Ltd.