
‘డ్రాగన్’తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన యంగ్ బ్యూటీ కయాదు లోహర్.. క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ అమ్మడి హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో కయాదు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. నాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ప్యారడైజ్’లో హీరోయిన్ గా కయాదు నటిస్తోంది. శనివారం కయాదు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ‘సుబ్బు’ అనే పాత్రలో నటిస్తుంది కయాదు. పోస్టర్ లో వైట్ అండ్ బ్లూ కలర్ డ్రెస్‌లో క్యాప్ ధరించి వింటేజ్ లుక్‌లో సైకిల్‌పై వెళ్తున్న కయాదు లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో దసరా మూవీ తర్వాత తెరకెక్కుతున్న రెండో చిత్రం ప్యారడైజ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సినీ ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ వెనక్కి తగ్గారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నారు.