Reading Time: < 1 minute
పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు

ఊరు దాటని కథలు.. చుట్టూ పచ్చటి పంటపొలాలు.. అల్లుకుపోయే అనుబంధాలు.. గ్రామీణ నేపథ్యపు కథలు.. టాలీవుడ్‌లో మోస్ట్ ట్రెండింగ్ సినిమాలు ఇవే ఇప్పుడు. ఈ మధ్య కాలంలో సిటీ స్టోరీస్ కంటే రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలే బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్నాయి. కంటెంట్‌తోనే మాయ చేస్తున్నాయి గ్రామీణ కథలు. నెక్ట్స్ కూడా అవే క్యూలో ఉన్నాయి. గ్రామీణ నేపథ్యం ఉన్న కథలకు టాలీవుడ్‌లో డిమాండ్ బాగా పెరుగుతుంది. చిన్నా పెద్ద హీరోలు.. అంతా రూరల్ బ్యాక్‌డ్రాప్ వైపే అడుగులేస్తున్నారు. కొన్నేళ్లుగా పల్లె కథలు కాసులు కురిపించాయి. అది తెలంగాణ బలగం అయినా.. ఆంధ్రా నుంచి వచ్చిన కేరాఫ్ కంచెరపాలెం అయినా.. మొన్నొచ్చిన రాకాస అయినా.. కథ ఏదైనా పల్లె నేపథ్యం ఉంటే కనెక్ట్ అయిపోతుంది. హీరోలు కూడా తమను తాము నిరూపించుకోడానికి పల్లె కథలే కావాలంటున్నారు. రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతి రాజు మారెమ్మ అనే తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాతోనే వస్తున్నారు. అలాగే బలగం తర్వాత ఎల్లమ్మ అనే మరో గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాతోనే వస్తున్నారు వేణు. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎల్లమ్మలో దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. మొన్న పండక్కి వచ్చిన అనగనగా ఒకరాజు కూడా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన కథే. దానికి ముందు కిరణ్ అబ్బవరం క, పొలిమేర సైతం రూరల్ బ్యాక్‌డ్రాప్ కథలే. ఇక కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించారు.. ఏప్రిల్ 17న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి పల్లెటూరి కథల ట్రెండ్ నడుస్తుందిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది

Mega 158: చిరంజీవి తేల్చేసారు.. ముహూర్తం అప్పుడే

టాలీవుడ్‌లో ఊహించని కాంబినేషన్స్.. అదిరిపోతున్న క్రేజ్

టాలీవుడ్‌లో పర్సెంటేజ్ యుద్ధం.. నిర్మాత-ఎగ్జిబిటర్ల మధ్య కొత్త వివాదం

Dhurandhar 2: అవుట్ స్టాండింగ్ అంటున్న సందీప్.. ఫిదా అయిపోయిన ప్రభాస్..