
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కోటి చీరల తయారీకి గాను టెస్కోకి ప్రభుత్వం రూ.450 కోట్ల ఆర్డర్ ఇచ్చిందని అధికార వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, సెర్చ్. మెప్మాల సీఈవో దివ్యా దేవరాజ్‌లు చీరల్లో వివిధ నమూనాలను సిద్ధం చేయగా, ఈసారి చిలకపచ్చ రంగు. ఎరుపు జరీ డిజైన్‌తో చీరను ముఖ్యమంత్రి ఎంపిక చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నేత కార్మికులకు టెస్కో ద్వారా చీరలు తయారు చేసి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అక్టోబరు నాటికి చీరలను సిద్ధం చేస్తే నవంబరు 19న ఇందిరాగాంధీ జయంతికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.